మదర్సాలో పిల్లలను గొలుసులతో బంధించారు.. !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని లక్నోలోని మదర్సా నుంచి పారిపోకుండా ఉండేందుకు ఇద్దరు పిల్లలను ఇలా కాళ్లకు గొలుసులతో కట్టి బంధించారు. మదర్సాలో చదువుకునేందుకు ఓ కుటుంబం తమ ఇద్దరు అబ్బాయిలను చేర్పించారు. పిల్లలు ఇద్దరూ మదర్సా నుంచి పారిపోతారేమోనని వారి తల్లిదండ్రులు మౌలానాకు అప్పగించారు. వారిద్దరి విషయంలో కొంచెం కఠినంగా ఉండాలని, లేదంటే పారిపోతారని తల్లిదండ్రులు సూచించారు. దాంతో మౌలానా ఆ ఇద్దరి పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు మదర్సాకు వెళ్లారు. ఆ పిల్లలను విడిపించిన పోలీసులు.. ఎందుకు ఇలా గొలుసులతో బంధించారని ప్రశ్నించారు. తమ పిల్లల పట్ల కఠినంగా ఉండమని తామే మౌలానాకు చెప్పామని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పిల్లల తల్లిదండ్రులు పోలీసులను రాతపూర్వకంగా వేడుకున్నారు. పిల్లలకు చదువుపై ఇష్టం లేదని, వాళ్లు మదర్సా నుంచి పారిపోతారేమోనని ఇలా చేశారని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)