కట్నం కోసం హతమార్చారు !

Telugu Lo Computer
0


ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో కలకలం రేపిన మహిళ హత్య కేసులో షాకింగ్ నిజం వెలుగు చూసింది. భార్య కోసం పానీపూరి తీసుకొచ్చిన భర్తకు బాత్రూంలో ఆమె మృతదేహం కనిపించింది. ఇంటిపైన ఉండే కాంట్రాక్ట్ వర్కర్లే దొంగతనం చేసి, భార్య సోనీ ఉరఫ్ సంతోషీని చంపేశారని సంతోష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్యాప్తులో అసలు నిజం వెలుగు చూసింది. సంతోష్ కుమార్‌కు పిన్ని వరుస అయ్యే శాంతి కూడా అదే ఇంట్లో నివసిస్తోంది. ఆమెతో కలిసి భార్యను కట్నం కోసం సంతోష్ వేధించేవాడు. మార్చి ఐదో తారీఖున ఇదే విషయంలో శాంతి, సోనీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సోనీ విషం తాగేసింది. చావు బతుకుల మధ్య ఉన్న ఆమె మళ్లీ బ్రతికితే ప్రమాదం అనుకున్న శాంతి.. దగ్గరలో కనిపించిన కేబుల్ వైరుతో సోనీ గొంతు పిసికి చంపేసింది. అనంతరం అనుమానం రేకెత్తించేందుకు.. ఇంట్లోని విలువైన వస్తువులు ఎత్తుకెళ్లి దాచేసింది. కొన్ని వస్తువులను అదే బిల్డింగ్ పైన వాటర్ ట్యాంకుల కింద దాచేయగా, కొంత డబ్బును చుట్టాలకు ఇచ్చింది. అంతేకాదు శాంతి, సంతోష్ కుమార్ మధ్య గత 12 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ కారణంగానే ఆమె దంపతులతో పాటు కలిసి నివసిస్తున్నట్లు వాళ్లు అంగీకరించారు. దీంతో సంతోష్ కుమార్, శాంతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)