దేవెగౌడతో కేసీఆర్ భేటీ

Telugu Lo Computer
0


మాజీ ప్రధాన మంత్రి దొడ్డెగౌడ దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. బెంగళూరులోని తమ నివాసంలో కేసీఆర్‌కు దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ తదితరులున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమి ఏర్పాటు దిశగా నేతలు చర్చించారని సమాచారం. ఇప్పటికే ఈ దిశగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం, డిఎంకే అధినేత స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులతో వేర్వేరుగా జరిపిన చర్చల వివరాలను దేవెగౌడకు కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. కేసీఆర్ కొంత కాలంగా జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర నాయకులతో వేర్వేరుగా సమావేశమౌతున్నారు. 2024 నాటికి ఎన్డీయే, యూపియేతర పార్టీల నాయకులతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలని ముమ్మరంగా యత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఇటీవలే పంజాబ్ వెళ్లి రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయమందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)