ఈ ఏడాది మార్చి 31 నాటికి కనీసం 14 లిస్టెడ్ కంపెనీల్లో దమానీకి 1 శాతానికి పైగా వాటా ఉంది. వాటి విలువ ఇవాళ్టికి రూ.1.55 లక్షల కోట్లు. ఇందులో డీమార్ట్ కూడా ఉంది. డిసెంబర్ 31 నాటికి, ఇవే కంపెనీల్లో దమానీ గారి సంపద రూ.2.02 లక్షల కోట్లు. ఈ లెక్కన; డిసెంబర్ 31 నాటికి ఉన్న రూ.2.02 లక్షల కోట్ల సంపద ఇప్పుడు రూ.1.55 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, రూ.47 వేల కోట్లు కొట్టుకుపోయాయి. టాప్ హోల్డింగ్స్‌లో టాప్‌లో ఉన్న డీమార్ట్‌లో దమానీకి 65.2 శాతం వాటా ఉంది. దాని విలువ ఈ రోజు రూ.1,47,966.8 కోట్లు. ఈ ఏడాదిలో (జనవరి-మే, ఐదు నెలల్లోనే) ఇది 23 శాతం పడిపోయింది. మార్చి 31 నాటికి, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 32.5 శాతం వాటా ఉంది. ఈ క్యాలెండర్‌లో ఇది దాదాపు ఫ్లాట్‌గా ఉంది. ఈ కంపెనీలో దమానీ వాటా విలువ రూ.1,619.20 కోట్లు. మూడో అతి పెద్ద హోల్డింగ్ అయిన ఇండియా సిమెంట్స్ ఈ క్యాలెండర్ ఇయర్‌లో 19 శాతం పడిపోయింది. దమానీ దగ్గర రూ.632 కోట్ల విలువైన ఇండియా సిమెంట్స్ షేర్లు ఉన్నాయి. ఇతర హోల్డింగ్స్‌లో, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ట్రెంట్ 2 శాతం; యునైటెడ్ బ్రూవరీస్ 6 శాతం; సుందరం ఫైనాన్స్ 33 శాతం; 3ఎం ఇండియా 32 శాతం పడిపోయాయి. మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ షేర్లు నిట్టనిలువున కుప్పకూలాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 53 శాతం దిగజారాయి. ఈ సంవత్సరంలో ఈనాటి వరకు... బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ 14 శాతం పెరిగింది; సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ 13 శాతం తగ్గింది; ఆస్ట్రా మైక్రోవేవ్ 9 శాతం పడిపోయింది; ఆంధ్ర పేపర్ 50 శాతం పెరిగింది; బీఎఫ్ యుటిలిటీస్ 20 శాతం క్షీణించగా; మంగళం ఆర్గానిక్స్ 34 శాతం నష్టపోయింది.
కష్టం కాలంలో డీమార్ట్ దమానీ ?
May 28, 2022
0