నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటాను, కానీ..: !

Telugu Lo Computer
0


”నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటాను. కానీ, నేను అవివేకిని కాదు. మన మతం ఏదన్న విషయాన్ని మన రాజకీయాల ఆధారంగా పరిగణించవద్దు. మన మతం అనేది మన కుటుంబానికి సంబంధించిన అంశం. అంతేగానీ, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు” అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్  అన్నారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు ఓబీసీల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లలో అతి తక్కువ కోటా మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ఓబీసీలకు 35 శాతం కోటా ఇస్తామని చెప్పిన బీజేపీ.. జిల్లా పంచాయతీ సభ్యులకు ఎన్నికల సమయంలో ఓబీసీలకు 11.2 శాతం, జన్‌పద్ పంచాయతీ అధ్యక్షుడి పదవుల్లో 9.5 శాతం, జన్‌పద్ పంచాయతీ సభ్యుడి కోటాలో 11.5 శాతం, సర్పంచ్ ఎన్నికల్లో 12.5 శాతం కోటా మాత్రమే కేటాయించిందని కమల్‌నాథ్ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)