డిపోలోని ఆర్టీసీ బస్సునే కొట్టేసిన ఘనుడు !

Telugu Lo Computer
0


కేరళలోని కొచ్చి పరిధి అలువా డిపోలో గురువారం ఉదయం కేఎస్‌ఆర్‌టీసీ బస్సు చోరీకి గురైంది. మెకానిక్‌ యూనిఫామ్‌లో డిపోకు వచ్చిన నిందితుడు కేఎస్ఆర్టీసీ బస్సుని దొంగిలించాడు. దూరంగా చూసిన వారు కూడా బస్సును చెకింగ్ కోసం మెకానిక్ తీసుకెళ్తున్నాడని ఉద్యోగులు, సిబ్బంది భావించారు. అయితే అతివేగంగా వస్తున్న బస్సును చూసి అనుమానం వచ్చిన సెక్యూరిటీ అధికారి డిపోకు సమాచారం అందించారు. డిపో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బస్సును ఎవరో కావాలనే తీసుకెళ్లినట్టుగా గుర్తించిన పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే చోరీని కేసును చేధించారు. ఎర్నాకులంలోని కలూర్ సమీపంలో వాహనాన్నిపోలీసులు గుర్తించారు. డిపో నుంచి బస్సును తీసుకెళ్లిన నిందితులను నార్త్ పోలీసులు పట్టుకున్నారు. విచారణ అనంతరం కాలూరు సమీపంలో బస్సును స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)