కేసీఆర్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ

Telugu Lo Computer
0


రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రగతి భవన్ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం వరకు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం ప్రశాంత్‌ కిశోర్‌ రాత్రి ప్రగతిభవన్‌లోనే బస చేశారు. పీకే సోమవారం తిరిగి ఢిల్లీ ప్రయాణమవుతారు. ఈ భేటీ నేపథ్యంలో త్వరలోనే జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించనున్నాయని తెరాస వర్గాలు అంటున్నాయి. సరైన సమాచారం లేకుండా.. కొన్ని సమాచార సాధనాలు నిరాధారమైన కథనాలు ప్రచారం చేస్తున్నాయని పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)