ఢిల్లీలో కరోనా ఫోర్త్‌వేవ్ భయం

Telugu Lo Computer
0


దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కేసుల సంఖ్య 60 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తోంది. కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమౌతోంది. జూన్ నాటికి కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభం కానుందనే అంచనాలు నిజమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జూన్ నాటికి ప్రారంభమై అక్టోబర్ వరకూ ఉంటుందనే కాన్పూర్ ఐఐటీ నిపుణుల హెచ్చరికలు వాస్తవరూపం దాల్చనున్నాయా అన్పిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, నోయిడాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇదే సంకేతమిస్తున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 1,900 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారంతో పోలిస్తే 60 శాతం అత్యధికం. మంగళవారం నాడు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 632గా ఉంది. ఫలితంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణను ఢిల్లీ ప్రభుత్వం మరోసారి తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించి మాస్క్ ధరించకపోతే ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)