పుష్ప విడుదలై దాదాపు నాలుగు నెలలు గడుస్తోన్నా ఇప్పటికీ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. సినిమాలోని డైలాగ్స్, పాటలకు సంబంధించిన రీల్స్ నెట్టింట మారుమోగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ పదో తరగతి కుర్రాడు చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థి ఆన్సర్ పేపర్లో ఏకంగా పుష్ప డైలాగ్‌ను రాసేశాడు. సమాధానాలకు బదులుగా పుష్ప సినిమాలోని 'తగ్గేదేలే' డైలాగ్‌ను పోలుస్తూ 'పుష్ప, పుష్ప రాజ్.. పరీక్ష రాసేదేలే' అంటూ రాసేశాడు. దీంతో ఇది చూసిన ఉపాధ్యాయుడు ఫోటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొందరు పుష్ప మేనియాకు ఇది నిదర్శనమని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం పరీక్షా పత్రంలో ఇలా రాయడం తప్పని వాదిస్తున్నారు.
పీక్స్‌కి చేరిన పుష్ప ఫీవర్...!
April 07, 2022
0
Tags