ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ విభాగం అధికారులు నాందేడ్ నుంచి విశాఖపట్నం వరకు ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. నాందేడ్ లో సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి రెండో రోజున ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాపట్నం నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైలు ముద్‌ఖేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి మీదగా విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి అదే మార్గంలో నాందేడ్ వస్తుంది.
నాందేడ్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
April 11, 2022
0
Tags