అతివేగంగా దూసుకొచ్చి నలుగురి మృతికి కారణమైన బొలేరో

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు వద్ద కడప-బెంగళూరు జాతీయ రహదారిపై బొలేరో వాహనం వేగంగా దూసుకొచ్చి నలుగురు మృతికి కారణమైంది. డ్రైవర్‌ అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన వారిని దేవి (27), అమ్ములు (30), ఆమె భర్త కొండయ్య (45), లక్ష్మీదేవి (35)గా పోలీసులు గుర్తించారు. వీరిలో కొండయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతిచెందగా.. అమ్ములు, దేవిలను కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. వీరంతా కొండయ్య ఇంటి గడపలో మంచంపై కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంతలోనే వాహనం వారిమీదకి అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ వ్యాన్ కడప నుంచి రాయచోటికి వెళ్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తంరిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)