బీహార్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్నిరాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగింది. ఈ వేడుకల్లో సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో మూడేండ్ల తర్వాత అట్టహాసంగా నిర్వహించిన బీహార్ దివస్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు స్కూళ్లకు చెందిన వందలాది విద్యార్థులను ఆహ్వానించారు. బీహార్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద ఆహారం తిన్న వందలాది మంది విద్యార్థులు అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. 156 మందికిపైగా విద్యార్థులు ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు పాట్నా మెడికల్ కాలేజీకి చెందిన వైద్యురాలు విభా సింగ్ తెలిపారు. చాలా మందికి కడుపులో వికారం, వాంతులు వంటి సమ్యలున్నాయని చెప్పారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. తిన్న ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. దీనిపై దర్యాప్తు కోసం జిల్లా కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.
బీహార్ దివస్ లో పాల్గొన్న విద్యార్థులకు అస్వస్థత
March 24, 2022
0
Tags