ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో ఓ విచిత్ర దొంగ పోలీసులకు చిక్కాడు. అతడు చోరీ చేసిన బంగారం దాచిన తీరు తెలిసి పోలీసులే కంగుతిన్నారు. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని జైల్లో పెట్టారు. అతని వృత్తి ఎలక్ట్రీషియన్ చుట్టుపక్కల ఇళ్లల్లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక్క ఫోన్ కొడితే చాలు వెంటనే క్షణాల్లో వాలిపోతాడు. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. దాంతో పాటే..తనకున్న మరో ప్రవృత్తిని కూడా అక్కడే ఇంప్లిమెంట్ చేస్తాడు. అదును చూసి ఇంటికి కన్నాలు వేయడం బంగారం, వెండి వస్తువులు కాజేసి ఊడాయిస్తుంటాడు. ఇంతకీ దొంగిలించిన సొత్తును స్విచ్ బోర్డులు, కరెంట్ మీటర్లలో భద్రంగా దాస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలక్ట్రీషియన్ దొంగతనం కహానీలు మొత్తం బయటపెట్టారు.
స్విచ్ బోర్డులు, కరెంట్ మీటర్ లో దాచిన దొంగ సొమ్ము !
March 26, 2022
0