ఢిల్లీ-జైపూర్ హైవేపై రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Telugu Lo Computer
0


ఢిల్లీ-జైపూర్ హైవేపై గురుగ్రామ్‌ సమీపంలోని బినౌలా గ్రామం వద్ద నేషనల్ హైవేపై గుర్తు తెలియని ట్రక్..కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బిలాస్ పూర్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు మృతి చెందిన ఐదుగురు వ్యక్తులు ఒక ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్నారు. సంస్థ పని నిమిత్తం వీరు గురువారం తెల్లవారుజామున కారులో గురుగ్రామ్‌ కు బయలుదేరారు. మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రక్ కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఒకరు సీనియర్ మేనేజర్ కాగా.. ఆయనకు రెండు నెలల వయసున్న పాప ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)