ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది. ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సీఎం జగన్ రెడీ అయిపోతున్నట్లుగా కనపడుతుంది. ఈనెల 15న జరిగే వైసీపీ ఎల్పీ భేటీ సమావేశంలో ఏపీ మంత్రి వర్గ విస్తరణతో పాటు ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలకు జగన్ పూర్తిగా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2022, మార్చి 11వ తేదీ శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతోంది. మొత్తం మంత్రులను మారుస్తారని ప్రచారం జరిగినా.. కొందరిని కంటిన్యూ చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఏడుగురు మంత్రులను మినహాయించి మిగతా మంత్రులందర్నీ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
15న వైసీపీఎల్పీ భేటీ !
March 12, 2022
0
Tags