జ్వరం, ఇన్ఫెక్షన్లతో పాటు బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, అనీమియా వంటి వాటికి వాడే అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ ప్రకటించింది. పలు రకాల మందుల ధరలు 10.7శాతం పెరగనున్నాయిని పేర్కొంది. షెడ్యూల్ చేసిన మందులకు 10 శాతానికి పైగా పెంచడానికి ప్రభుత్వం అనుమతించింది. అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 షెడ్యూల్డ్ మందుల ధరలు ఈ మేరకు పెరుగుతాయి. ప్రజలు ఎక్కువగా వాడే పారాసెటమాల్ తో పాటు ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, మెట్రోనిడజోల్, అజిత్రోమైసిన్ వంటి ఔషధాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా కారణంగా ఔషధాల తయారీ ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో వాటి ధరలు పెరగనున్నాయి. దీనికి అవసరమైన అనుమతులను కూడా నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ మంజూరు చేసింది. ఇన్ఫెక్షన్లను నివారించడం, చర్మవ్యాధుల కోసం వాడే మందులు, గుండె జబ్బులు, అనీమియా, హై బీపీ లాంటి సమస్యలకు ఉపయోగించే మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి. కరోనా కాలంలో దేశంలో అత్యధికంగా వాడింది పారాసెటిమాల్.. డోలో-650 ట్యాబ్లెట్లనే. అయితే ప్రస్తుతం వీటి ధరలు కూడా పెరగనున్నాయి. వీటితో పాటు కరోనా చికిత్సలో ఎక్కువగా వినియోగించిన యాంటీ బయాటిక్ అజిత్రోమైసిన్ తో పాటు విటమిన్ ట్యాబ్లెట్లకు కూడా ధరలు పెరగనున్నాయి.
అత్యవసర ఔషధాలపై 10.7% పెంపు !
March 26, 2022
0
Tags