ప్రియుడి కోసం ఐదుగురిని హత్య చేసింది!

Telugu Lo Computer
0


కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో ఒకే ఇంట్లోని ఓ మహిళతోపాటు ముగ్గురు చిన్ని పిల్లలు మరో యువకుడు హత్యకు గురయ్యారు.ఈ హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే కేసును చేధించారు.. హత్య చేసి ఓ మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం హత్య జరగడానికి గల కారణాలు వెల్లడించారు. నిందుతురాలు తనకు సోదరి వరుస అయిన లక్ష్మి భర్త గంగారామ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆయనంటే ఆమె పిచ్చిగా మారింది. కాగా గంగారామ్‌ వస్త్ర వ్యాపారం చేస్తూ .. నిత్యం పలు రాష్ట్రాలు తిరుగుతాడు. ఈ క్రమంలోనే నిందితురాలు ఆమె సోదరిని భర్త నుండి దూరం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. కాని లాభం లేకపోవడంతో నేరుగా ఆ కుటుంబాన్ని హతమార్చేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే గంగారం గత ఆదివారం ఇంట్లో లేని అర్థరాత్రి సమయంలో నిందితురాలు ఆయన ఇంటికి వెళ్లింది. ఆమె చాలా సేపు వాగ్వావాదానికి దిగింది. ఈ క్రమంలోనే అప్పటికే చికెన్ సెంటర్ నుండి తెచ్చుకున్న కత్తితో ఆమెను హతమార్చింది. ఇక వాగ్వావాదం సయయంలో ముగ్గురు పది సంవత్సరాల లోపు పిల్లలు లేచి ఏడుస్తుండగా వారిని కూడా దారుణంగా హతమార్చింది. వారితోపాటు ఉన్న మరో యువకుడిని కూడా హతమార్చింది. ఇలా ఐదు హత్యలు చేసిన తర్వాత ఇంట్లో దోపిడి జరిగినట్టుగా చీత్రీకరించింది. బీరువాలోని బట్టలు చెల్లాచెదురు చేసింది. తనకు అంటిన రక్తపు మరకల బట్టలు కూడా మార్చుకుంది. ఆ తర్వాత మృతదేహాలపై బట్టలు కప్పి ఓ టూ వీలర్‌పై తెల్లవారు జామున నాలుగు గంటలకు ఇంటినుండి బయటకు వెళ్లింది. ఏమి తెలియనట్టు తిరిగి మరునాడు వారి అంత్యక్రియలకు సైతం హజరయ్యింది. అయితే విచారణ జరిపిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా ఆమె తెల్లవారుజామున నాలుగు గంటలకు నిందితురాలు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి అసలు నిజాలు రాబట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)