టాలీవుడ్ లో నటి హేమ అంటే తెలియని వారంటూ ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఏ పాత్రనైన అవలీలగా చేసేస్తుంది. తెరపై ఈమె కామెడీ టైమింగ్ లు అభిమానులు పొట్ట నొప్పి వచ్చేలా నవ్వాల్సిందే. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలకమైన నటిగా రాణిస్తోంది. అక్క, వదిన, అత్త, సవతి తల్లి తరహా పాత్రల్లో హేమ ఒదిగిపోయి నటిస్తుంది. అందరి హీరోల సినిమాలో ఏదో ఒక్క క్యారెక్టర్ చేసి మనల్ని మెప్పించింది. ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్ళి సందడి చేసిన ఈమె ఈ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో శివ బాలజీ చెయ్యి కొరికి సంచలనంగా మారింది. ఇక ఈ మధ్య కాలంలో హేమ నిత్యం ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ కష్టాలను గుర్తు చేసుకుంటూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. దర్శకుడు ముత్యాల సుబ్బయ్య భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో తనకు జరిగిన ఘోర అవమానం గురించి చెప్ప్తూ.." షాట్ కంప్లీట్ అయ్యాక భోజనం టైం అవ్వడంతో ఆకలి వేసి తినడానికి కూర్చున్నాను. ప్లేట్ లో అన్నం పెట్టుకుని వచ్చి టేబుల్ మీద కూర్చుని అన్నం తింటుండగా వెంటనే ఓ ప్రొడక్షన్ బాయ్ వచ్చి ఇక్కడ కాదు పోయి అటు పక్కన కూర్చో అంటూ అవమానించాడు. నాకు మొదలే కోపం ఎక్కువ..ఇక అలా అన్నం దగ్గర మాట్లాడేసరికి కోపం వచ్చి.. వెంటనే టేబుల్ ఎత్తి పడేసి కుర్చీ తీసి అతనిపై విసిరెయ్య బోయా. ఇంతలో పక్క వాళ్ళు వచ్చి ఆపారు"..అంటూ చెప్పుకొచ్చింది హేమ.
అన్నం తింటుంటే ఇక్కడ కాదు పోయి అటు కూర్చో....!
February 04, 2022
0
Tags