అర్థం చేసుకునే బుర్ర మీకు లేదు: నిర్మలా సీతారామన్

Telugu Lo Computer
0


బడ్జెట్​పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు చూసి తాను జాలి పడుతున్నానన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల కోసం బడ్జెట్​లో ఏమీ లేదన్న రాహుల్ విమర్శలను ఆమె తోసిపుచ్చారు. " రాహుల్.. ముందు బడ్జెట్‌ను అర్థం చేసుకోవాలి. ట్విట్టర్​లో ఏదొకటి పోస్ట్ చేయాలన్న హడావుడిలో బడ్జెట్‌లో ఏం లేదు ఇలా అనడం తగదు. ఆయన సరైన హోంవర్క్ చేయాలి. బడ్జెట్​ను పూర్తిగా అర్థం చేసుకుని విమర్శిస్తే సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. ముందు ఆయన పంజాబ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సంగతి చూసుకోవాలి. ఆ తర్వాత దేశం గురించి మాట్లాడితే బాగుంటుంది. " అని నిర్మలా సీతారామన్ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)