విశాఖ జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున బుధవారం రాత్రి చింతపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల 2 లో రాత్రి మకాం చేశారు. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు.బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు చేసిన థిసా నత్యాన్ని తిలకించారు. విద్యార్థినులతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని రాత్రి వేళ వాచ్ ఉమెన్ కావాలని కలెక్టర్ దష్టికి తీసుకు వచ్చారు. వెంటనే పరిష్కారం చేయాలని ఐటీడీఏ పిఓ గోపాలకష్ణ రోణంకి ఆయన సూచించారు. బాలుర ఆశ్రమ పాఠశాలకు సీసీ ర్యాంప్, ప్రహారి గోడ, టివి, క్రీడా సామగ్రి మంజూరు చేయాలని విద్యార్థులు కోరారు. దానికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వి.అభిషేక్, స్థానిక ఏఎస్పి తుషార్ డూడి, డిఈఓ రమేష్ పాల్గొన్నారు.
వసతి గృహంలో కలెక్టర్ రాత్రి బస
February 03, 2022
0
Tags