బొబ్బిలిలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని మైథాన్ పరిశ్రమ వద్ద స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న మహిళల్ని అదుపు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ వారిని ప్రత్యేక వాహనాల్లో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వాహనాల్లో వెళ్లేందుకు ఆందోళనకారులు నిరాకరించారు. ఈ క్రమంలో స్థానికులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలు పోలీసులపై మట్టి చల్లారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా ఆందోళనకారులు శాంతించలేదు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా తరలించడం సరికాదంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సహా పలువురు పోలీసు అధికారులు వారించే ప్రయత్నం చేసినా ఆందోళనలు ఉద్ధృతం చేశారు. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో మరింత మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉద్రిక్తత !
February 08, 2022
0
Tags