అర్జున్ రెడ్డితో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి శ్రీసుధ టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడుపై వేసిన లైంగిక వేధింపుల కేసు గురించి తెలిసిందే. తనని ప్రేమించానని చెప్పి.. ఐదేళ్లు సహజీవనం చేసి.. చివరికి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని సినీ నటి శ్రీసుధ శ్యామ్ కె.నాయుడుపై కేసు వేసింది. అయితే తాజాగా శ్యామ్ కె. నాయుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ శ్రీసుధ వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు సహజీవనం చేసి శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్యామ్ కె.నాయుడు, శ్రీసుధ కేసులో.. తాను ఒప్పందం ప్రకారమే చేశానని అందుకు రూ.50 లక్షలు డీడీ రూపంలోచెల్లించానని పత్రాలను శ్యామ్ కె.నాయుడు కోర్టుకు సమర్పించాడు. దీంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక శ్యామ్ కె.నాయుడుతో పాటు ఆయన సోదరుడు ఛోటా కె.నాయుడు కూడా తనను బెదిరిస్తున్నారని, చంపడానికి కుట్ర చేస్తున్నారని శ్రీసుధ ఆరోపణలు చేశారు. తన కారుని కూడా కావాలని యాక్సిడెంట్ చేశారని ఆమె పేర్కొంటూ సుప్రీం కోర్టులో కేసు వేశారు.
సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌కు సుప్రీం కోర్టులో ఊరట !
February 06, 2022
0
Tags