జూన్‌ లో ఫోర్త్ వేవ్ ?

Telugu Lo Computer
0


దేశంలో సెకండ్‌వేవ్‌ నుంచి థర్డ్‌వేవ్‌ వరకు దాదాపు 6 నెలల గ్యాస్‌ తీసుకున్న కోవిడ్‌ ఈ సారి నాలుగు నెలలకే రీ-ఎంట్రీ ఇవ్వనుంది. నాలుగోవేవ్‌కు నాలుగు నెలలే సమయం ఉందని, వచ్చే జూన్‌లో ఫోర్త్‌వేవ్‌ ఎంట్రీ ఇచ్చి అక్టోబర్‌ వరకు కొనసాగుతుందని అంచనా వేశారు. 'భారత్‌లో నాలుగో దశ జూన్‌ 22న మొదలై, ఆగస్టు 23 పీక్‌ స్టేజ్‌కి చేరుకొని, అక్టోబర్‌ 24న ముగియనుందని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ అంశాలను పరిశోధించేందుకు వారు 'బూస్ట్‌స్ట్రాప్' అనే పద్ధతిని ఎంచుకున్నారు. దీని ద్వారా ఇతర దేశాల్లో రాబోయే వేవ్‌లను కూడా అంచనా వేయొచ్చని తెలిపారు. నాలుగో వేవ్ తీవ్రత అనేది వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. గత మూడు వేవ్‌ల సమయంలో కొవిడ్‌ కేసులు, పీక్‌ టైమ్‌, మరణాల సంఖ్యలో ఐఐటీ కాన్పుర్‌ పరిశోధకుల బృందం వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే అలసత్వం వహించొద్దని, ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)