సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈస్ట్ మారేడుపల్లిలోని గీతా టిఫిన్స్ ఎదురుగా ఉన్న లరీసా ఎక్స్‌క్లూసివ్ స్పా అండ్ సెలూన్ సెంటర్ నిర్వాహకులు రంగం కిషోర్(35), అనీష్(25) సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తుకారాంగేట్ పోలీసులు సెంటర్‌పై దాడి చేశారు. సెంటర్ యజమానులు కిషోర్, అనీష్‌లతో పాటు ఇద్దరు మహిళలను, విటుడు ఆంటొనీ (46)ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 1500 నగదు స్వాధీనం చేసుకొని మంగళవారం రంగం కిషోర్, అనీష్, ఆంటొనీలను రిమాండ్ చేశారు. మహిళలను ప్రజల్వ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సెలూన్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
February 09, 2022
0
Tags