ఏ ఉద్యోగికీ జీతం తగ్గలేదు

Telugu Lo Computer
0


కొత్త పీఆర్సీ ప్రకారం ఏ ఒక్క ఉద్యోగి జీతం తగ్గలేదని, ప్రతి ఒక్కరి గ్రాస్‌ జీతం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చెప్పారు. జీతాలు పెరిగాయి కాబట్టి ఆందోళనలు విరమించుకుని మంత్రుల కమిటీతో చర్చలకు రావాలన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పే ఫిక్సేషన్‌ దాదాపు పూర్తయిందని డిసెంబర్, జనవరి నెలల పే స్లిప్‌లను పోల్చి చూసుకుని ఎంత జీతం పెరిగిందో తెలుసుకోవచ్చన్నారు. ఐఆర్‌ కలిసినా, కలవకపోయినా జీతాల్లో పెరుగుదల ఉందన్నారు. ఎవరి జీతం తగ్గించకూడదని సీఎం చెప్పారని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 32 గ్రేడ్ల పే స్లిప్‌లను పరిశీలిస్తే ఎవరికీ జీతం తగ్గలేదన్నారు. సాధారణంగా పీఆర్సీలో ఐఆర్‌ కలపరని, ఇప్పుడు దాన్ని కలిపి చూసినా కొంచెం పెరుగుదల ఉందని చెప్పారు. ఐఆర్‌ తీసేసి పీఆర్సీ టు పీఆర్సీ చూస్తే ఇంకా కొంచెం పెరుగుదల ఎక్కువ ఉందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)