ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 4605 కేసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30,578 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 4605 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. కోవిడ్ వల్ల అనంతపురం, కడప. కర్నూలులలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం మరియు విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 641 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 93488 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 11,729 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2185042 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా 3,25,71,365 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అనంతపురం 218, చిత్తూరు 290, ఈస్ట్ గోదావరి 642, గుంటూరు 524, వైస్సార్ కడప 413, కృష్ణ 477, కర్నూల్ 318, నెల్లూరు 501, ప్రకాశం 342, శ్రీకాకుళం 105, విశాఖపట్నం 219, విజయనగరం 17, వెస్ట్ గోదావరి 539 గా నమోదయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)