మొదటి రోజు దాదాపు 40 కోట్లు?

Telugu Lo Computer
0


భీమ్లా నాయక్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ దుమ్మురేపుతోంది. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఎక్కువ రేటుకు ప్రీ బిజినెస్ జరిగిన సినిమాగా రికార్డ్ స్పష్టించిన భీమ్లానాయక్.. తొలి రోజు కలెక్షన్లలో దుమ్ము రేపింది. మన దేశంలో మొదటి రోజు దాదాపు 40 కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో తొలి రోజే 8 కోట్ల బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికే భీమ్లానాయక్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 108 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా మొత్తంగా 150 నుంచి 180 కోట్ల వరకు వసూల్ చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ 150 కోట్ల క్లబ్ కు చేరడం ఖాయమంటున్నారు.వకీల్ సాబ్ చిత్రం 80 కోట్ల దగ్గరే ఆగిపోయింది. తొలి ఆట నుంచి అభిమానులను అలరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వివాదం ఉన్న అక్కడ నుంచి మంచి కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో అదనపు షోలకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో నైజాంలో అధిక శాతం వసూళ్లు చేసినట్లు సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)