2000 ఏండ్లలో ఏర్పడ్డ మంచు 25 ఏండ్లలో కరిగిపోయింది

Telugu Lo Computer
0


ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌. ఆ శిఖరం ఓ మంచు కొండ. కానీ ఆ ఎవరెస్ట్ శిఖరం చాలా వేగంగా కరిగిపోతోంది. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లో 2000 ఏళ్లలో ఏర్పడిన మంచు మొత్తం కేవలం 25 ఏళ్లలోనే కరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే ఆ మంచు ఏర్పడడానికి తీసుకున్న సమయం కన్నా 80 రేట్లు వేగంగా కరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మెయిన్‌కు చెందిన పరిశోధకులు ఈ తాజా విషయాన్ని తేల్చారు. నేచర్ క్లైమేట్ జర్నల్‌లో దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను పబ్లిష్ చేశారు. మౌంట్ ఎవరెస్ట్‌పై ఉన్న గ్లేసియర్‌ను సౌత్ కల్నల్ గ్లేసియర్ అంటారు. ఆ గ్లేసియర్‌పై మంచు ఏర్పడడానికి పట్టిన సమయం కన్నా 80 రెట్టు వేగంగా మంచు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. మానవ తప్పిదాల వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. టూరిస్ట్ ప్రాంతమైన ఎవరెస్ట్ శిఖరంపై సుమారు 12వేల కిలోల మానవ వ్యర్ధాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఒకవేళ ఇంతే వేగంగా ఎవరెస్ట్ కరిగిపోతే అప్పుడు గ్లేసియర్లు అడుగంటిపోనున్నాయి. దీంతో హిమాలయాల్లో ఆ నీటిపై ఆధారపడే సుమారు వంద కోట్ల మందికి నీటి కష్టాలు ఏర్పడే ప్రమాదం ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)