వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఆంటిగ్వాలోని కూలీస్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. భారత్ తరఫున కెప్టెన్ యశ్ ధుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ 110 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ 94 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 41.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. జట్టులో లచ్లాన్ షా 51 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌కు యష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఫైనల్లో 1998 ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 5న సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
అండర్-19 వరల్డ్ కప్ లో ఫైనల్‌కు చేరిన ఇండియా
February 03, 2022
0
Tags