దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్పహెచ్చుతగ్గులతో రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం బుధవారం 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14,148 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే కేసులు 6 శాతం తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.22 శాతానికి క్షీణించింది. 24 గంటల వ్యవధిలో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. 2020 జనవరి నుంచి 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,12,924 మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 1,48,359(0.35 శాతం)కి పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 30 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4.22 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.46 శాతానికి పెరిగింది. ఇక నిన్న 30 లక్షల మంది టీకా తీసుకోగా.. 13 నెలల వ్యవధిలో 176 కోట్లకుపైగా డోసులు ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది.
దేశంలో 14,148 వేల కరోనా కేసులు
February 24, 2022
0