ప్రస్తుతం ఐశ్వర్య రామోజీ ఫిలిం సిటీలో ఒక సాంగ్‌ను షూట్ చేస్తుండటంతో అక్కడి సితార హోటల్లో బస చేస్తున్నారు. అటు ధనుష్ తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూట్‌లో పాల్గొంటున్నాడు. దీంతో ధనుష్ కూడా అదే హోటల్లో బస చేస్తున్నాడు. విడాకులతో విడిపోయిన ఈ జంట ప్రస్తుతం ఒకే హోటల్లో స్టే చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 13న ఐశ్వర్య-ధనుష్ జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇకపై ఎవరి దారుల్లో వారు నడవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తమ నిర్ణయాన్ని గౌరవించి తగిన ప్రైవసీ కల్పించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. 2004లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు యాత్రా రాజా (15), లింగ రాజా (11) ఉన్నారు. గతంలోనే ఈ జంట విడిపోయేందుకు సిద్ధపడగా రజనీకాంత్ నచ్చజెప్పడం వల్లే కలిసి ఉంటున్నారనే ప్రచారం ఉంది. గతంలో సుచీలీక్స్ సమయంలో ధనుష్ ఇద్దరు హీరోయిన్లతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు బయటకు రావడంతో అప్పటి నుంచి ఐశ్వర్య, ధనుష్‌ల మధ్య విభేదాలు మొదలైనట్లు చెబుతున్నారు. కాగా, ఐశ్వర్య, ధనుష్ మళ్లీ కలుస్తారనే నమ్మకాన్ని ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెలిబుచ్చడం గమనార్హం. అభిప్రాయ బేధాలే తప్ప అదేమీ విడాకులు కాదని భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమని ఆయన చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లో ఒకే హోటల్లో ధనుష్, ఐశ్వర్య
January 23, 2022
0
Tags