డేవిడ్‌ వార్నర్‌ శ్రీవల్లి పాటలోని బన్నీ సిగ్నేచర్‌ స్టెప్‌!

Telugu Lo Computer
0


అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' చిత్రం విడుదలకు ముందు, ఆ తర్వాత కూడా ఎంతగా క్రేజ్‌ తెచ్చుకుందో తెలిసిందే. ఈ చిత్రంలో పాటలు, డైలాగ్‌లు, హీరో మేనరిజానికి జనాల్లో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. మీమ్స్‌ రూపంలోనూ ఈ చిత్రానికి మరింత బలం చేకూరింది. తాజాగా ఆరేస్టలియన్‌ బ్యాట్స్‌ మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ శ్రీవల్లి పాటలోని బన్నీ సిగ్నేచర్‌ స్టెప్‌ వెయ్యగా అది విపరీతంగా వైరల్‌ అయింది. కేరళలో ఓ ఉత్సవంలో ఈ చిత్రంలోని 'సామీ సామీ' పాట హల్‌చల్‌ చేసింది. కేరళ సంప్రదాయంలో ఒకటైన సింగారి మేళం బృందం ఓ వేడుకలో 'సామీ సామీ' పాటను వాయించి అలరించింది. ఈ వీడియో కూడా ట్రెండింగ్‌లో ఉండగా, కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో కరోనా అవగాహన కోసం ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ శాఖ ఆసక్తికర మీమ్‌ క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేసింది. అందులో పుష్పలోని అల్లు అర్జున్‌ స్టిల్‌కు ఫొటోషాప్‌లో మాస్క్‌ అతికించి పోస్ట్‌ చేశారు. దానిపై 'పుష్ప.. పుష్పరాజ్‌.. తగ్గేదేలే' అంటూ... 'అది డెల్టా వేరియంట్‌ అయినా, ఓమిక్రాన్‌ అయినా మాస్క్‌ తీసేదేలే'' అని రాసుకొచ్చారు. శుక్రవారం నుంచి మరో కార్టూన్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఈసారి ఏకంగా దేశ ప్రధాని మోదీతోనే శ్రీవల్లి పాటకు స్టెప్పులేయిచారు. కొందరు క్రియేటివ్‌ మైండ్‌తో మోదీ కార్టూన్‌ క్రియేట్‌ చేసి పుష్ప రాజ్‌ స్టెప్‌ వేయించడమే కాకుండా లాస్ట్‌లో తగ్గేదేలే అంటూ మేనరిజం కూడా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడమే కాకుండా ఫన్‌ పంచుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)