ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనబడుట లేదు!

Telugu Lo Computer
0


ప్రజల ఓట్లతో గెలిచి ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రజా ప్రతినిధులు తమ విధులను విస్మరిస్తే అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? కొందరైతే సదరు ప్రజా ప్రతినిధులు వచ్చిన సమయంలో తమ నిరసనను తెలియజేస్తారు. మరికొందరు లోలోపల తిట్టుకుంటూ తమ అసహనాన్ని వెళ్లగక్కుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంజేపల్లి గ్రామం లోని ప్రజలు వేగంగా తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఆచూకీ చెప్పాలంటూ వినూత్న శైలిలో తమదైన నిరసనను తెలియజేశారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ గుంజేపల్లి ప్రజలు ఏకంగా గ్రామంలో పోస్టర్లు వేశారు. తమ ప్రాంత ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోకపోవటం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలపాలంటూ గ్రామంలో పోస్టర్లు వేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేటి వరకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సమస్యలను పరిష్కరించ లేదని ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గుంజేపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే పద్మావతి కనిపించడంలేదని పోస్టర్లు వేసి తమ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే పద్మావతి ఫోటో వేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటూ పేర్కొని ఆమె కనిపించటం లేదన్నారు. తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఎలక్షన్ టైం లో ఓట్లు అడగడానికి వచ్చిన పద్మావతి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని పోస్టర్ లో ముద్రించారు. ఇదే సమయంలో ప్రజా సమస్యలను పక్కకునెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు అంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆచూకి తెలుపగలరు ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు శింగనమల నియోజకవర్గం అని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)