మత మార్పిడులను అడ్డుకునేందుకు చట్టం చేయాల్సిందే !

Telugu Lo Computer
0


మత మార్పిడులను అడ్డుకునేందుకు కచ్చితంగా చట్టాన్ని రూపొందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈరోజు పంజాబ్‌లోని జలంధర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మతం అనేది వ్యక్తిగత అంశమని, ప్రతి ఒక్కరికి దేవుడిని ఆరాధించే హక్కు ఉందన్నారు. మత మార్పిడులను నివారించేందుకు కచ్చితంగా చట్టాన్ని చేయాలని, కానీ ఆ చట్టంతో ఎవర్నీ అనుచిత రీతిలో వేధించవద్దు అని ఆయన అన్నారు. భయపెట్టి మతం మార్చడం తప్పుడు విధానం అని కేజ్రీవాల్ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)