ప్రపంచ ప్రఖ్యాత సంస్థ 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' మంగళవారం 'కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ని విడుదల చేసింది. ప్రపంచంవ్యాప్తంగా మొత్తం 180 దేశాలకు ఆయా దేశాల్లో అవినీతి స్థాయిని బట్టి ర్యాంకు ఇచ్చారు. భారత్ ఒక ర్యాంకును మెరుగుపరచుకొని 85వ స్థానానికి చేరుకోగా..పాకిస్తాన్ 120 నుంచి 140వ స్థానానికి చేరుకుంది. డెన్మార్క్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొదటి స్థానంలో నిలిచింది. అంటే డెన్మార్క్ ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ గల దేశం. ఫిన్లాండ్ రెండవ స్థానంలో, న్యూజిలాండ్ మూడవ స్థానంలో, నార్వే నాల్గవ స్థానంలో, సింగపూర్ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో దక్షిణ సూడాన్ 180వ స్థానంలో నిలిచింది. అంటే ప్రపంచంలోనే అవినీతి ఎక్కువగా ఉండే దేశం సౌత్ సూడాన్. దీనికి ముందు సిరియా, సోమాలియా, వెనిజులా, యెమెన్ దేశాలులు ఉన్నాయి. అవినీతి నిరోధక చర్యలు పెరుగుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని నివేదిక తెలిపింది. మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొంది. 2021 గ్లోబల్ 'కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్'లో 180 దేశాలలో పాకిస్థాన్ 16 స్థానాలు దిగజారి.. 140వ ర్యాంక్‌కు చేరుకుందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. తాము అధికారంలోకి వస్తే పాకిస్తాన్‌ను అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ప్రపంచవ్యాప్తంగా అవినీతి స్థాయి స్థిరంగా ఉందని.. బెర్లిన్‌కు చెందిన నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్టు వెల్లడించింది. 86 శాతం దేశాలు గత 10 ఏళ్లలో తక్కువ లేదా పురోగతి సాధించలేదని పేర్కొంది. ఇది ఆందోళనకర విషయమని చెప్పింది. 180 దేశాలు, భూభాగాల్లో సున్నా (అత్యంత అవినీతి) నుంచి 100 (అత్యంత నిజాయిత) స్థాయిలలో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ర్యాంక్లు ఇచ్చారు. 2020లో పాకిస్తాన్ CPIలో 100కి 31 స్కోర్ సాధించి.. 180 దేశాలలో 124వ స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు 28 స్కోర్‌తో.. ఏకంగా 140వ స్థానికి పడిపోయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం.. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (CPI)లో భారత్ స్కోరు 40. మొత్తం 180 దేశాల్లో 85వ స్థానంలో ఉంది. గతంతో పోల్చితే కాస్త మెరుగుపడింది. అదే సమయంలో బంగ్లాదేశ్ స్కోరు 26 కాగా..ప్రపంచవ్యాప్తంగా 147వ స్థానంలో నిలిచింది.
ప్రపంచంలో అత్యంత నిజాయితీ గల దేశం డెన్మార్క్
January 28, 2022
0
Tags