బీజేపీలో అపర్ణ యాదవ్

Telugu Lo Computer
0


దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ, యాదవ పరివారానికి చెందిన అపర్ణ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్పీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలైన అపర్ణ యాదవ్ సరిగ్గా ఎన్నికల వేళ బావ అఖిలేశ్ కు షాకిస్తూ ఎర్రటోపీని పక్కన పడేసి కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కొడుకైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్ కొద్దిసేపటి కిందటే బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్ సమక్షంలో అపర్ణ కమలదళంలో చేరారు. మౌర్య, స్వతంత్రదేశ్ ఆమెకు సభ్యత్వమిచ్చి, కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితోనే తాను బీజేపీలో చేరుతున్నట్లు అపర్ణ యాదవ్  పేర్కొన్నారు. 'నేను అనునిత్యం ప్రధాని మోదీ నుంచి స్ఫూర్తి పొందుతూ వచ్చాను. అన్నిటికంటే దేశమే ముఖ్యం నాకు. అందుకే దేశ సేవ కోసం ముందుకొచ్చాను. 'అని అపర్ణ వ్యాఖ్యానించారు. మరదలు బీజేపీలో చేరడంపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)