భద్రాద్రి కొత్త గూడం జిల్లా చంద్రగొండ మండలంలోని సూజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలేరో వాహనంలో బయలుదేరారు. ఇదే క్రమంలో తిప్పనపల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన బొగ్గు టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి స్వాతి, సుజాత అనే ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మొత్తం పది కూలీలు గాయపడ్డారు. అయితే గాయపడిన వారిలో మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో చనిపోయారు. గాయపడిన వారిని 108 ద్వారా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
భద్రాద్రి కొత్త గూడం జిల్లా రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
January 28, 2022
0
Tags