బంగాళాఖాతంలో వచ్చే12గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది 48గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. డిసెంబర్ మూడు వరకు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ అంటోంది. ఇప్పటికే, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారితే చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మళ్లీ ఏడు నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని చెబుతుంది. ఐఎండీ హెచ్చరికలతో రాయలసీమ, కోస్తాంధ్రలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు వాయుగుండం ముప్పు
December 01, 2021
0