ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని మేడికొండూరు ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికతో వ్యభిచారం చేయిస్తున్న కేసులో మహిళా సినీ నిర్మాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని స్వర్ణ భారతి నగర్ కు చెందిన సదరు నిర్మాత కొన్ని సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఆ మహిళ బాలికను బెదిరించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. అయితే బాధిత బాలిక ఆ మహిళ నుంచి తప్పించుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇక బాధిత బాలిక ఓ మాజీ ఎంపీకి బంధువని తెలుస్తోంది. బాలికను రక్షించిన గుంటూరు పోలీసులు ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గుంటూరులో తరచుగా వ్యభిచారం కేసులు వెలుగు చూస్తున్నాయి. బంగ్లాదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. ఇక సదరు మహిళా నిర్మాత వ్యభిచారం చేయిస్తుండడంతో ఆమె వెనక ఎవరైనా ఉన్నారా ? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
వ్యభిచారం కేసులో మహిళా నిర్మాత ?
December 23, 2021
0
Tags