అమితాబ్‌ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్‌

Telugu Lo Computer
0


బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ముంబై సౌత్‌ అంధేరిలో ఇటీవల కొనుగోలు చేసిన డుప్లెక్స్‌ ప్లాటును అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు అమితాబ్‌. డూప్లెక్స్‌ ప్లాట్‌కి అద్దెగా నెలకు రూ. 10 లక్షలు రూపాయలు తీసుకుంటున్నారు. దీనికి సెక్యూరిటీ డిపాజిట్‌గా ఇప్పటికే కృతి సనన్‌ రూ. 60 లక్షలు చెల్లించింది. వీరి మధ్య కుదిరిన అగ్రిమెంట్‌ ప్రకారం 2021 అక్టోబరు 16 నుంచి 2023 అక్టోబరు 15 వరకు ఈ ఇల్లు కృతి సనన్‌ ఆధీనంలో ఉంటుంది. అంధేరిలోని లోకండ్‌వాలా రోడ్డులో ఉన్న అట్లాంటిస్‌ బిల్డింగ్‌లో 27, 28వ అంతస్థులో అమితాబ్‌ ఇల్లు ఉంది. దీని మొత్తం విస్తీర్ణం 5,184 చదరపు అడుగులు. ఈ ఇంటిని 2020 డిసెంబరులో అమితాబ్‌ రూ. 31 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. 2021 ఏప్రిల్‌లో ఇంటిని ఆయన హాండోవర్‌ చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)