డిసెంబర్ చివరికల్లా పూర్తికావాల్సిన ఢిల్లీలోని సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాజెక్ట్‌లో 60 శాతం పనులు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. వచ్చే ఏడాది అక్టోబర్‌కల్లా పూర్తికావాల్సిన కొత్త పార్లమెంట్ భవంతి పనులు 35 శాతం పూర్తయినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర భవనాలు, పట్టణాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ గురువారం లోక్‌సభలో చెప్పారు. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంట్, కేంద్ర సచివాలయం, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, ఉపరాష్ట్రపతి నివాసం నిర్మిస్తారు. పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,289 కోట్లు కేటాయించినట్లు కౌశల్ చెప్పారు.