వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రికగా జన్మించింది. వారి తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చింది. ఎనిమిదవ ఏటనే ఆవిడ ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆమె కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.
వివాహానంతరం భర్తతో ముంబయిలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకొన్నారు.