హైదరాబాద్ లోని కాటేదాన్‌లోని పోషక్‌ఫుడ్ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రణవీర్ సింగ్ (41) శనివారం యజమానికి చెందిన మరో పరిశ్రమలో ఇవ్వడానికి రూ.6.3 లక్షల నగదుతో ఉన్న బ్యాగును బండిపై పెట్టుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో సంచి పడిపోయినా గుర్తించకుండా వెళ్లిపోయాడు. కాలినడకన వస్తున్న పాలిమర్ కంపెనీలో పనిచేసే కార్మికుడు అశోక్ తివారి (29)కి ఆ బ్యాగ్ కనిపించింది. తెరచి చూడగా నగదు ఉంది. ఆ సంచిని తన యజమాని రణబీర్‌కు అప్పగించాడు. రణబీర్ వెంటనే అశోక్‌ను వెంటబెట్టుకుని నేరుగా మైలార్‌దేవుపల్లి ఠాణాకు వచ్చాడు. అదే సమయంలో నగదు పోగొట్టుకున్న రణవీర్ ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఠాణా పరిశీలనకు వచ్చారు. బ్యాగును పోగొట్టుకున్న రణవీర్‌కు నగదు అందించిన రణబీర్, అశోక్‌లను కమిషనర్ అభినందించారు.
దొరికిన సొమ్ము పోలీసులకు అప్పగింత
November 28, 2021
0