దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నా!

Telugu Lo Computer
0

 


ఓట్ల కోసమే బీజేపీ నేతలు గారడీ వేశాలు వేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని తెలిపారు. దళితుడిగా బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. 70 ఏళ్లలో దళితులకు ఎప్పుడూ న్యాయం జరగలేదని ఆయన మండిపడ్డారు. దళితబంధు బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? అని నిలదీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)