హోటల్‌లో నిర్బంధించి అత్యాచారం

Telugu Lo Computer
0



దేశ రాజధాని ఢిల్లీలో అంకిత్ సెహ్రావర్త్ అనే వ్యక్తి పోలీసు ఉద్యోగినంటూ ఓ మహిళను నమ్మించాడు. తెలిసిన చోట ఉద్యోగం ఇప్పిస్తాను.. ఒకసారి కలవాలని చెప్పాడు. అంకిత్ మాటలు విన్న సదరు మహిళ నవంబర్ 6వ తేదీన ఢిల్లీలోని ద్వారకలో కలిసింది.  బైక్‌పై వచ్చిన అంకిత్ సమీపంలోని హోటల్‌కి తీసుకెళ్లాడు. ఇది గమనించిన మహిళ చెక్‌ఇన్‌కి ముందు రూమ్‌లో బస చేసేందుకు నిరాకరించింది. దీంతో హోటల్ యజమాని తనకు తెలుసని.. భయపడాల్సిన అవసరం లేదని తాను పోలీస్ అంటూ మరోసారి చెప్పాడు. అంకిత్ మోసపూరిత మాటలను గ్రహించని మహిళ రూములోకి వెళ్లింది. వెంటనే గడియపెట్టిన అతడు మందు తాగాలంటూ బలవంతం చేశాడని.. అనంతరం అత్యాచారం చేసి, పరారీ అయ్యాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఇనుపరాడ్డుతో ముఖం మీద కొట్టడమే కాకుండా, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడని, చివరకు రూములో బంధించి పరారీ అయ్యాడని పోలీసులకు ఫోన్‌కాల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. లైవ్‌ లొకేషన్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హోటల్‌ రెండో అంతస్థు బాల్కనీలో బాధిత మహిళ కన్నీరుపెట్టుకోవడాన్ని గుర్తించినట్టు చెప్పారు. వెంటనే తాళాలు బద్ధలు కొట్టి బాధితురాలిని స్థానిక డీడీయూ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అత్యాచారం, హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్నామని.. ఇప్పటికే హోటల్ యజమాని సంజయ్‌ను అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్న అంకిత్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని వివరణ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)