బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించేది లేదు

Telugu Lo Computer
0


దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనే ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు . బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించట్లేదని ఆమె హౌస్‌లో వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ.. రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు-2021ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలోనే సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. ఒకవైపు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్‌ను భారత ప్రభుత్వం నిషేధించబోతోందని చర్చ జరుగుతుండగానే.. మరోవైపు సింగపూర్-బెస్ట్ వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఎక్స్‌చేంజ్ పేరు కాయిన్‌స్టోర్ తన వెబ్, అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. బెంగళూరు, న్యూఢిల్లీ , ముంబైలలో కొన్ని శాఖలను తెరవాలని యోచిస్తోంది. భారతదేశంలో 100 మందికి పైగా ఉద్యోగులు ఉండేలా కాయిన్‌స్టోర్ సిద్ధమవుతోందని చార్లెస్ టాన్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)