ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న 74 రోజులు జైల్లో ఉన్నారు. కాగా తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు
November 08, 2021
0
Tags