రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

Telugu Lo Computer
0



హర్యానాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించారు. హర్యానా లోని జఝ్జర్ జిల్లాలోని బద్ది ప్రాంతంలో కేఎంపీ( కుండ్లి-మనేసర్-పాల్వాల్) ఎక్స్ ప్రెస్ వే పై అగి ఉన్న లారీని కారు ఢీ కొట్టటంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నారు. గాయపడిన వారిని, మరణించిన వారి మృతదేహాలను సమీపంలోని బహుదూర్ ఘర్ ఆస్పత్రికి తరలించారు. రాజస్ధాన్ నుండి 11 మందితో ఉత్తరప్రదేశ్ వెళ్తున్న ఎర్టిగా కారు జాతీయ రహదారిపై, బద్లి- ఫరూఖ్ నగర్ మధ్య ఆగి ఉన్న లారీని ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది.ఇదే కారు వెనుక ఏడుగురు ప్రయాణికులతో వస్తున్న ఎకో కారు ప్రమాదం జరిగిన ఎర్టిగా కారు వద్ద ఆగి చూస్తుండగా. ఆకారు వెనుక వస్తున్న మరోక లారీ ఎకో కారును ఢీ కొట్టటంతో అందులోని ఒకరు మరణించారు. మరి కొందరికి గాయాలయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)