తు.చ తప్పకుండా...!

Telugu Lo Computer
0




చెప్పిన పని చెప్పినట్టు చేస్తా అనడానికి 'తు.చ ' తప్పకుండా చేస్తా అంటూంటాం కదా! ఈ తు.చ లేమిటి? ఎక్కడినుంచి వచ్చాయి?అని అడిగితే 'ఎవరు తుమ్మినా, చచ్చినా సరే ఆ పని చేస్తా అని చెప్పడానికి ఈ మాట వాడుతుంటామోయ్.అని చెప్పాడో గడుసు పండితుడు. తు .చ కు  ఆయన వ్యాఖ్యానం సృజనాత్మకం గానే వుంది కానీ వాస్తవం అదికాదు. సంస్కృత శ్లోకాలను నిర్దేశిత ఛందస్సుల్లో వ్రాస్తారు కదా! ఛందస్సు అనగానే పాదానికి  యిన్ని గణాలు అని లెక్క వుంటుంది. ఒక్కోసారి శ్లోకంలో కవి చెప్పాలనుకున్న భావం పూర్తిగా వచ్చేసి నప్పటికీ గణాలేవో తక్కువపడి ఛందస్సు సరిపోదు. అలాంటి సందర్భంలో  శ్లోక భావాన్ని మార్చకుండా, కొత్త పదాలను కలపకుండా ఛందస్సులోని ఖాళీ లన్నీ పూరించడానికి 'తు' 'చ' అనే అక్షరాలను పెట్టేవారు. తర్వాత ఎవరైనా ఆ శ్లోకాన్ని మరో భాషలోకి అనువదించేటప్పుడు ఆ 'తు' 'చ' లతోసహా మక్కికి మక్కి అనువాదం చేశారనుకోండి! తు,చ తప్పకుండా చేశారు అనడం రివాజు అయింది. అందరికీ తెలిసిన 'ధర్మేచ,అర్థేచ , కామేచ  శ్లోకంలో ఆ 'చ' లేకున్నా అర్థం ఏమీ మారిపోదు. అలాగే  'మమ కుర్వ౦తు లో కూడా గణాలను సరిపెట్టడానికి   మాత్రమే వీటిని వాడారన్నమాట. అనువాదం చేసేటప్పుడు ఈ 'తు' 'చ' లతో సహా చేస్తే అదే 'తు' 'చ' తప్పకుండా చేయడం.

Post a Comment

0Comments

Post a Comment (0)