తొమ్మిదో పెళ్లికి సిద్ధపడిన మహిళ...!

Telugu Lo Computer
0


హర్యానా లోని కైతాల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి కూడా అయింది. కొన్ని రోజుల వరకు దంపతులు బాగానే ఉన్నా ఓ రోజు ఆమె భర్త ఇంటి నుంచి వెళ్లి ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాలేదు. ఆమెకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. బంధువులు, స్నేహితుల వద్ద వెతికింది. కానీ అతడి ఆచూకీ మాత్రం ఎక్కడా లభించలేదు. ముగ్గురు పిల్లలతో ఆమె ఎలా బతకాలో అర్థం కాకుండా ఉంది. ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఆ మహిళ. ఆ క్రమంలోనే ఆమెకు ఓ చెడు ఆలోచన వచ్చింది. అప్పడి నుంచి మోసాలు చేయడం ప్రారంభించింది. ఆమెకు తన తల్లి కూడా సహకారం అందించింది. పంజాబ్, హర్యానాలలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న లేదా భార్య చనిపోయిన భర్తలను ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తిని ట్రాప్ చేసి రహస్యంగా ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు ముఖ్యంగా..పెళ్లి అయి విడాకులు తీసుకున్న వాళ్లు, సింగిల్ గా ఉన్న అబ్బాయిలను మాత్రమే టార్గెట్ చేసేది. ఆమె ప్లాన్ అమలు చేసిందంటే.. పక్కాగా జరిగిపోయేది. ఇలా పెళ్లి చేసుకొని పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఏదో ఒక కారణంతో గొడవలు పెట్టుకునేది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగేది. దాంతో తనకు విడాకులు కావాలంటూ గొడవ పెట్టుకొని.. విడాకులతో పాటు భారీ మొత్తంగా భరణం చెల్లించుకుని అక్కడ నుంచి వెళ్లిపోయేది. ఇలా ఒక నెల రోజులు ఆగి మళ్లీ.. మరో యువకుడికి వల వేసేది. ఇలా ఆమె ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుంది. ఇక తొమ్మిదో పెళ్లి చేసుకోబోతుంటే.. పోలీసులు వచ్చి ట్విస్ట్ ఇచ్చారు. ఆమె వివాహం చేసుకున్న వారిలో ముగ్గురు యువకులు.. ఇటీవలే ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె గురించి ఆరా తీశారు. తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వివరాలను తెలసుకొని వాళ్లు ఆ ప్రదేశానికి వెళ్లి పెళ్లిని రద్దు చేశారు. తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)